IND vs PAK చెలరేగిన భారత్ బౌలర్లు ఇక పాకిస్తాన్ ఇంటికేనా *Cricket | Telugu OneIndia

2022-08-28 6,581

Pakistan all out for 147 as Bhuvneshwar Kumar takes 4 wickets | ఆసియాకప్‌లో శుభారంభం చేసే దిశగా టీమిండియా దూసుకెళ్తుంది. పాకిస్థాన్ జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. దాంతో పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. భువనేశ్వర్ కుమార్(4/26) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(3/25) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అయితే ఓ దశలో పాక్ 130 పరుగులు కూడా చేస్తుందా? అనిపించింది. కానీ చివరి బ్యాటర్ షాన‌వాజ్ దహని(6 బంతుల్లో 2 సిక్స్‌లతో 16) కీలక పరుగులతో 148 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు. పాక్ జట్టులో బాబర్ ఆజామ్(42 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) మినహా అంతా విఫలమయ్యారు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది.

#INDvPak
#AsiaCup2022
#Bhuvneshwar
#RohitSharma

Videos similaires